Sunday, 3 April 2011

కొత్త బిజినెస్‌లోకి నమిత ఎంట్రీ ..???


సదరన్ స్పైస్ నమిత.. సినిమాలకు చెల్లుచీటీ ఇస్తానంటోంది. బరువుబాధ్యతలు పెరిగిపోయి.. కాల్‌షీట్లు మిగిలిపోయి.. ఎటూపాలుపోక.. రిటైర్మెంట్ వైపు చూస్తోంది. అలాగని సినిమాలు మానేసి.. సైలెంట్‌గా కూర్చుంటుందా..? అదీ లేదు.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.. ఏంటా బిజినెస్.. ఏమా కథ..? నమిత అంటే నథింగ్ బట్.. నాటుబాంబు. సినిమా లోపలా బయటా.. మగరాయుడిలా బతికింది. అన్ని దక్షిణాది భాషల్లోనూ చెలరేగి నటించింది. 
రెండో హీరోయిన్‌గా రెండుమాడు సీన్లలో కనిపించినా.. ఐటమ్ గాళ్‌గా ఆరితేరినా అందరిలోనూ కిక్కు రేపింది. పదేళ్లపాటు ఒకే ఫామ్‌ను ఎంజాయ్ చేసింది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అందరు హీరోల సరసనా కనిపించాక.. నమిత దగ్గర స్టాక్ అయిపోయినట్లుంది. బాడీకి బరువు పెరిగి.. మేనికి గ్లామర్ తగ్గి.. ఛాన్సులిచ్చేవాళ్లు మొహం చాటేస్తున్నారు. పాతవాసనలే పెట్టుబడిగా అవకాశాలకు వల విసరాల్సిన పరిస్థితి.
వయసు ఫార్టీప్లస్‌లో పడింది. వెయిటూ వందకు దగ్గరవుతోంది. నమిత సినిమా క్లయిమాక్స్‌కొచ్చినట్లేనని అందరూ కమిటయ్యారు. అందర్లాగే.. నమితది కూడా.. గ్లామర్ వున్నప్పుడే కాసులు ఏరుకోవాలన్న స్ట్రాటజీ. అందుకేనేమో.. రూటు మార్చేసి.. బిజినెస్‌ వైపు స్టెప్పులేస్తోందీ అమ్మడు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి.. ముంబైలో రియలెస్టేట్ బిజినెస్ మొదలుపెడుతోంది. కానీ.. ముంబైలాంటి మహానగరాల్లో లాండ్ కొనడం, అమ్మడం అంటే.. మాటలు కాదు. నమిత దగ్గర ఇంత దమ్ము వుందా..? ఫిల్మీ కొలీగ్స్ అంతా ఇలాగే షాకవుతున్నారు. 

No comments:

Post a Comment