Sunday 20 March 2011

పెట్టుబడి వంద కోట్లు...లాభం రెండు వేల కోట్లు


పరవాడ, మార్చి 19: వంద కోట్ల రూపాయలను పెట్టబడి పెట్టి రెండు వేల కోట్ల రూపాయలను రాంకీ ఇండియా లిమిటెడ్ వెనుకేసుకుందని మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. శనివారం వెనె్నలపాలెంలో గల బండారు స్వగృహంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పరవాడ మండలంలో స్థాపించిన జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటి అభివృద్ధి కార్యక్రమాన్ని రాంకీ యాజమాన్యానికి ప్రభుత్వ అప్పగించింది. ఈ పనులను దక్కించుకున్న రాంకీ యాజమాన్యం నిబంధనలను విస్మరించిందన్నారు. దీంతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకుందని ఆయన ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన విలేఖరులకు వివరించారు. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంతో ఎల్ అండ్ టి సమక్షంలో రాంకీ యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రపంచస్థాయి నాణ్యత గల అధునాతన పరికరాలను ఫార్మాసిటిలో ఏర్పాటు చేయాలని, అభివృద్ధి చేసిన స్థలాన్ని ఎకరాకు 20లక్షల రూపాయల మేర విక్రయించే విధంగా ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం ఫార్మాసిటిలో ఎకరా స్థలం కోటి రూపాయలకు పై బడి విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఫార్మాసిటిలో వచ్చిన లాభాల్లో 41శాతం ప్రభుత్వానికి, 59శాతం రాంకీ యాజమాన్యానికి దక్కే విధంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయితే 2004 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి వరంగా మారిందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వాటాకింద రావాల్సి 41శాతం నిధుల్లో 12 శాతం ప్రభత్వం రాంకీయాజమాన్యానికి మినహాయింపు ఇచ్చిందన్నారు. అలాగే ఆర్ధిక బిడ్ ప్రభుత్వం, రాంకీ సంస్థ అవకతవకలు చేశాయన్నారు. దీని కారణంగా వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనం రాంకీ ఖాతాలోకి వెళ్లిందన్నారు. అలాగే ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో 250 మీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం అది కాస్తా రైతుల భూములపైకి నెట్టిందని ఆయన అన్నారు. ఫార్మాసిటీలోనెలకొల్పిన వ్యర్ధజలాల శుద్ధి కర్మాగారం నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి నాణ్యత పరంగా చేపట్టాలని, అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన రాంకీ వారికి ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణం చేపట్టడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అనుమతులు మంజూరుకు ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చి నిబంధనలు పాటించక పోవడంతో ఇటీవల ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రాంకీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫార్మాసిటిలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్సార్ అల్లుడుతో పాటు రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పరిశ్రమలను స్థాపించారని ఆయన ఆరోపించారు. దీంతో రాంకీ యాజమాన్యం వారి అండ చూసుకొని ఫార్మాసిటిలో పూర్తిగా నిబంధనలను తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. కాలుష్యరహిత ఫార్మాసిటిగా అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి పూర్తి అధికారులను కట్టబెట్టి వారి ఇష్టానుసారంగా వ్యవరించేందుకు సహకరించిందని ఆయన విమర్శించారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కలుగుజేసి కొని తక్షణమే చర్యలు తీసు కోవాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో మండలాధ్యక్షులు మాధంశెట్టి నీలబాబు, కార్మికనేత మాసవరపు అప్పలనాయుడు, మత్స్యకార నేత చింతకాయల ముత్యాలు, టిడిపి నేతలు బొండా సన్నిదేముడు, కోమటి వెంకట రమణ, ఇందల కొండలరావు, సింగపల్లి దివాకర్, రొంగలి గోపాలకృష్ట, వర్రి పరిదేశినాయుడు తదితరలు పాల్గొన్నారు.

సునామీ భయంతో పరుగులు తీసిన పూడిమడక మత్స్యకారులు


అచ్యుతాపురం, మార్చి 19: మండలంలో పూడిమడక సముద్రపునీరు గ్రామాల్లోకి చొరబడిరావడంతో గ్రామస్థులు సునామీ భయంతో పరుగులు తీసారు. ఇటీవల జపాన్‌లో వచ్చిన సునామీ తాకిడికి పలు దేశాలను కుదిపేసింది. అంతేగాక చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నట్లు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. పూడిమడక సముద్రం తీరందాటి గ్రామాల్లోకి నీరు రావడంతో మత్స్యకారులు హుళక్కుపడ్డారు. గతనెల మాఘపౌర్ణమిరోజు సముద్రం ఉగ్రరూపం దాల్చి ఎతె్తైన ప్రదేశంలో ఉన్న జాలారిపేట గ్రామంలో నీరుచొరబడి మత్స్యకారులను ఆందోళనకు గురిచేసింది. సముద్రతీరంలో నీరు రాకుండా అడ్డుకట్టవేసిన ఇసుకమూటలను సైతం తోసుకుని గ్రామాల్లోకి నీరు చొరబడింది. సముద్రం వెనకకు తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా ఈ మాఘపౌర్ణమి రోజున మరలా సముద్రం పొంగి గ్రామాల్లోకి చొరబడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. శనివారం తెల్లవారున సముద్రకెరటాల అలజడికి పోటెత్తి ఒక్కసారిగా నీరు జాలారిపేటకు చొరబడింది. ముందు సునామీ అనుకుని పరుగులు తీసిన మత్స్యకారులు సముద్రం వెనక్కుతగ్గడంతో మత్స్యకారులు ఊపిరిపీల్చుకున్నారు. గంగమ్మతల్లికి మత్స్యకారులు పూజలు చేస్తున్నారు.

Tuesday 8 March 2011

మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఐకాస పిలు పు మేరకు ఈ నెల 10వ తేదీన తలపెట్టిన హైదరాబాద్‌ దిగ్బంధం (మిలియన్‌ మార్చ్‌)ను కట్టడి చే సేందుకు పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. మిలియన్‌ మార్చ్‌పై వున్న సందిగ్దకు తె రదించుతూ ఈ కార్యక్రమం జరిగితీరుతుందని ఐకాస నేతలు సోమవారం స్పష్టం చేయగా, దీనికి అనుమతి లేన ందున అడ్డుకుని తీరతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌, సైబరా బాద్‌ కమిషనరేట్లలో ముందుగానే 144 సెక్షన్‌ను విధించారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు పదవ తేదీన హైదరాబాద్‌కు రాకుండా తెలంగాణ జిల్లాలలో అడుగడుగునా పోలీసులను మొహరించారు.  తెలంగాణ ఐకాస తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు పోలీసులు కసరత్తులు మొదలు పెట్టారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 10వ తేదీన ఉదయం నుంచి సాయ ంత్రం వరకు ఈ కార్యక్రమం జరగాల్సి వుంది. పదవ తేదీన తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌ కు పది లక్షల మందిని తరలించి అన్ని రోడ్లను దిగ్బంధం చేయాలన్నది ఐకాస నేతల వ్యూహం. రో డ్లపైనే వంటావార్పు చేయడంతో పాటు భోజనాలు కూడా చేసి సర్కారు కార్యక్రమాలను స్తంభింప చేస్తామని ఐకాస నేతలు ప్రకటించారు. మిలియన్‌ మార్చ్‌కు ముందుగా ఐకాస నిర్వహించిన 48 గం టల తెలంగాణ బంద్‌ విజయవంతమవడంతో హైదరాబాద్‌ దిగ్బంధం సైతం అంతే స్థాయిలో నిర్వ హించేందుకు నేతలు రంగం సిద్దం చేశారు. అయితే ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా మిలియన్‌ మార్చ్‌ను వా యిదా వేయాలని వివిధ వర్గాల నుంచి తెరాస తో పాటు ఐకాసపై ఒత్తిడి వచ్చింది. దీంతో కొంత మె త్తబడిన ఐకాస మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేయనప్పటికీ దీని వేళలను సడలించింది. ముందు గా అనుకున్న విధంగా కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వర కు నిర్వహించేందుకు నిర్ణయించింది. మిలియన్‌ మార్చ్‌ను హైదరాబాద్‌ అంతటా కాకుండా కేవలం ట్యాంక్‌బండ్‌ వరకే పరిమితం చేయాలని ఐకాస నిర్ణయించింది. ఈ కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందని, దీనికి పోలీసులు సహకరించాలని కూడా ఐకాస కోరింది. తెలంగాణ జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరింది. అయితే ఐకాస నేతల వినతిని పోలీసులు తోసిపుచ్చారు. మిలిమన్‌ మార్చ్‌కు అనుమతి లేదని, దీనిని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇంతకు ముందు రెండుసార్లు తెలంగాణ జిల్లాల ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎలా వ్యవహరించాలో డిజిపి అరవిందరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించగా సోమవారం నాడు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహించి మరీ మిలియన్‌ మార్చ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. జంట కమిషనరేట్లలో ఈ నెల 11వ తేదీ వరకు 144 సెక్ష న్‌ను విధించామని, మిలియన్‌ మార్చ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిని శివార్లలోనే నిలిపి వేస్తామని వారు పేరొన్నారు. పదవ తేదీన అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్‌కు రావద్దని వారు కోరారు.
రంగారెడ్డి, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు
తెలంగాణ అంతటా భారీ పహారా
ఇదిలావుండగా పదవ తేదీన జరగనున్న మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు నగర శివార్లలోని సైబరాబాద్‌తో పాటు దాని పక్కనే వున్న రంగారెడ్డి జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు రావాలంటే సైబరాబాద్‌ మీదుగానే రావాల్సి వుండడంతో పోలీసులు ఈ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌కు చేరుకోవడానికి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, మహ బూబ్‌నగర్‌ జిల్లాల నుంచి మార్గాలు వుండడంతో అక్కడా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ రెండు ప్రా ంతాలలో చెక్‌ పోస్టుల వద్ద పెద్ద సంఖ్యలో సాయుధులను నియమించనున్నారు. మంగళవారం నుం చి చెక్‌ పోస్టుల వద్ద పోలీ సుల మొహరింపు ప్రారంభమయ్యే వీలుంది. చెక్‌ పోస్టుల వద్ద వీలునుబట్టి స్థానిక పోలీసులతో పాటు సాయుధులు కూడా వుండేలా ఉన్నతాధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాలతో పాటు రైలు మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. తొమ్మిదవ తేదీ నుంచి హై దరాబాద్‌కు వచ్చే వారిపై నిఘా వుంచాలని నిర్ణయించారు. పదవ తేదీన హైదరాబాద్‌కు వచ్చే అన్ని రైళ్లను సైబరాబాద్‌ పరిధిలోనే నిలిపివేసి సోదాలు నిర్వహించి మిలియన్‌ మార్చ్‌కు వచ్చే వారిని అదు పులోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైదరాబాద్‌కు రాకుండా పోలీసులు ఇన్ని ఏర్పాట్లు చేయగా తెలంగాణ జిల్లాలలోనూ పరిస్థితి ఇదే విధంగా వుంది. తెలంగాణ జిల్లాలలోని అన్ని మండలాలలో ఇప్పటికే పోలీసు పహారా ఏర్పాటు చేయ డంతో పాటు పదవ తేదీన హైదరాబాద్‌కు ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకోసాగారు. తొమ్మిది, పద వ తేదీలలో భద్రతను మరింత పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


నీ వాటా ఎంత ?


నీ వాటా ఎంత ?


కాకరాపల్లి థర్మల్‌ ప్రాజెక్టు బాధితులను ఓదార్చేందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆ బాధి తులనుంచే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈస్ట్‌కోస్ట్‌ పవర్‌ ప్లాంట్‌లో నీ వాటా ఎంత? అంటూ బాధితులు నిలదీశారు. దీంతో జగన్‌ అవాక్కయ్యారు. ఊహించని ఈ సంఘటన నుంచి తేరుకుని, వారిని ఓదార్చేందుకు జగన్‌ నానా తంటాలు పడ్డారు. వాళ్లని నమ్మించడం ఆయనకు ఓపట్టాన సాధ్యం కాలేదు. ఈ పవర్‌ ప్లాంట్‌తో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ప్రత్యక్షంగానైనా, పరోక్షంగా నైనా ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.  అయినప్పటికీ ఈ కంపెనీలో ప్రధాన వాటాదారు లెంతమంది? వాళ్లెవ రెవరంటూ జనం నినాదాల రూపంలో ప్రశ్నల వర్షం కురి పించారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ ‘‘నాకుగానీ, నా కుటుంబానికిగానీ ఈ ప్లాం టుతో ఎటువంటి సంబంధం ఉన్నా నా కుటుం బం మట్టికొట్టుకు పోతుంది. సరేనా?’’ అంటూ ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శకు జగన్‌ ఇక్కడికి వచ్చారు. స్థానికుల ఆగ్రహావేశాలను స్వంగా అంచనా వేసి, అనుభవానికొచ్చిన జగన్‌ ఆ ఉద్రిక్తతను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు.  అబద్దాలు చెప్పడం తనకు చేతకాదని అన్నారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్లాంట్‌ మంజూరైందన్న విషయాన్ని అంగీకరించారు. అయితే స్థానికుల వ్యతి రేకతను వైఎస్‌ఆర్‌ దృష్టికి తేకుండా తప్పుదోవ పట్టించారని పరో క్షంగా మంత్రి ధర్మాన ప్ర సాదరావు తదిత రులపైనా విమర్శనాస్త్రలు సంధించారు.ఈ ప్లాంట్‌ పై ఇప్పుడు జరుగుతున్న గొడవలో 10 శాతం ప్రజలు కాదన్నా ఆ రోజేప్లాంట్‌ రద్దచేసేవారన్నారు. ఈప్లాంట్‌ వద్దని ఇంతమంది ప్రజలు చెప్పడం తప్పా అంటూ జగన్‌ ప్రశ్నించారు. వద్దన్న ఉద్యమకారుల శ వాలపై ప్లాంట్‌ నిర్మిస్తే వారి ఉసురు యాజమాన్యానికి తప్పక తగులుతుందన్నారు. ఇందులో తన కుటుంబానికి వాటాలున్నాయని కొంత మంది నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప ఇందులో తన ప్రమేయమేమీలేదని జగన్‌ స్పష్టం చేశారు.  ‘‘నాకు ఈ ప్రాజెక్టులో వాటా ఉంటే ఇప్పుడు నేనే వద్దని చెబుతున్నాను కాబట్టి ప్రభుత్వం వెంటనే రద్దు చేయమనండి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడు చు కోవాలన్నారు. ఇక్కడ థర్మల్‌ ఉద్యమకారులపై జరిగిన ఘటన ఎమర్జన్సీని తలపిస్తోంద న్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు థర్మల్‌ బాధితులను పరామర్శించడానికి వచ్చారు కాని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకలు కింజరాపు సోదరులు ఎందు రాలేదని నిలదీశారు. బాధితులను పరామర్శించి వెళ్లిన చంద్రబాబు అసెంబ్లీలో కాకరాపల్లి ఘటన పై చర్చ జరుగుతున్నప్పుడు ఎందు కు కనిపించలేదని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌, టీడీపీ నాయకలు కుమ్మకై ఈ ప్రాజెక్టు కడుతు న్నారనడానిక ఇంతకంటే నిదర్శన మేమికావాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇప్పటి నుంచి ప్లాంట్‌ ఆ గే వరకు మీ పోరాటంలో పాలు పంచుకుంటానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. తనకు ఇందులో వాటా ఉన్న విషయమై… ప్రభుత్వం జరిపే ఏ దర్యాప్తుకైనా సిద్ధమంటూ ఛాలెంజ్‌ చేశారు. ముందుగా ఆకాశలక్కవరం చేరు కున్న జగన్‌కు అక్కడి విద్యార్థులు థర్మల్‌ ప్లాంట్‌ రద్దు చేయాలని, ఎంపి కృపారాణి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, కింజరాపు సోదరులు డౌన్‌డౌన్‌ అంటూ ప్లకార్డు పట్టుకొని పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. అనంతరం జీరు నాగేశ్వరావు కుటుంబాన్ని జగన్‌ పరా మర్శిం చి ఓదార్చారు.కొంత ఆర్థిక సహాయం చేశారు. జగన్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే కొర్ల భారతి, కొండాసురేఖ, గొల్ల బాబురావు,ప్రసాద్‌రాజు, భూమా కరుణాకర్‌ రెడ్డి,కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపి కణితి విశ్వనాధం తదితరులు వున్నారు.



Monday 7 March 2011

ఎమ్మెల్సీ టిక్కెట్ ఎఫెక్ట్: ప్రరాపాకు వాసిరెడ్డి రాజీనామా!!

ప్రజారాజ్యంకు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రరాపాను విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేక, మనస్సు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో పని చేయలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె సోమవారం ప్రకటించారు. అయితే, వాసిరెడ్డి పద్మ రాజీనామాకు కారణాలు లేకపోలేదు. శాసనమండలి అభ్యర్థిత్వంపై ఆమె గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ సీటును ప్రరాపా సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆమె జీర్ణించుకోలేక పోయారు. 
దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకుని తన రాజీనామా లేఖను సోమవారం
 పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి పంపినట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీలో
 పీఆర్పీ విలీనాన్ని జీర్ణించుకోలేక పోతున్నందునే పార్టీని వీడుతున్నట్లు 
ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
**********************************

హాలియాలో గ్రహాంతర వాసి సంచారం


హాలియాలో గ్రహాంతర వాసి సంచారం
నల్గోండ జిల్లా అను ముల మండల కేంద్రం హాలియాలో గ్రహాంతర వాసి సంచరి స్తున్నట్లుగా ప్రచరం జోరుగా సాగు తుంది. ప్రతి ఒక్కరూ దీని గురించే చర్చించు కుంటున్నారు. స్ధానిక గ్రీన్‌ఫీల్డ్‌ పాఠశాలలో 9వ తరగతి చదువు తున్న మధుకర్‌ అనే విద్యార్థి మూడు రోజుల క్రితం సూర్యోదయాన తన ఇంటి ఆవరణలో బ్రష్‌ చేసుకుంటుండగా అతడికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఇంటి ఆవరణలోని అరటి చెట్టు ఆకుల మధ్య దెయ్యం ఆకారంలో నల్లని శరీర ఆకృతితో తెల్లని కళ్లతో వింత ఆకారంలో ఉన్న మనిషి దృశ్యం కనిపించడంతో సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాన్ని తమ పాఠశాల ఉపాధ్యాయులకు చూపించడంతో దానిని వారు కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసి చూడటంతో అతడు గ్రహాంతర వాసిగా భావించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్ధానికులు వింత దృశ్యాన్ని కళ్ళారా చూడటానికి నెట్‌ సెంటర్ల వైపుకు పరుగుతీస్తుండగా, టివి ఛానళ్ళ ద్వారా కూడా ఈ దృశ్యం ప్రసారం అవుతుండటంతో గ్రహాంతర వాసి విషయం చర్చనీయాంశంగా మారింది. స్ధానిక సిఐ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఐ బల్వంతయ్య ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి ఆ దృశ్యాలు ఉన్న సెల్‌ కిట్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Saturday 5 March 2011

ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి



విశాఖపట్నం. ఓ ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. హంతకుడు భర్తేనని అనుమానిస్తున్నారు. నగరం నడిబొడ్డున జన సమ్మర్ధం కలిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీపాలేనికి చెందిన దువ్వి కృష్ణవేణి (21)కి ఇదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సిహెచ్.రవికుమార్‌తో గత ఏడాది ఆగస్ట్ 29న వివాహం జరిగింది. అమ్మాయికి అతనిని వివాహం చేసుకోవడం ముందు ఇష్టం లేకపోయినా, ఆ తరువాత తల వంచక తప్పలేదు. వివాహ సమయంలో రెండు లక్షల రూపాయలు, మోటారు సైకిల్ కట్నంగా ఇచ్చారు. పెళ్ళయిన మూడు నెలలు సవ్యంగానే కాపురం చేశారు. ఆ తరువాత భార్య పేర ఉన్న ఇల్లు తన పేరన రాయమని వేధించడం మొదలుపెట్టాడు. కృష్ణవేణి తండ్రి, తల్లి కొన్ని కారణాల వలన విడివిడిగా ఉంటున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి పుట్టింట్లోనే తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. ఇప్పుడు ఆమె ఐదవ నెల గర్భవతి కూడా. రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న కృష్ణవేణి ఉదయం కాలేజీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుంటుంది. కొంత కాలం కిందట భర్త రవికుమార్, కృష్ణవేణిని చంపేస్తానని బెదిరించినట్టు ఆమె బంధువులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి బస్సులో మద్దిలపాలెం వరకూ వచ్చిన కృష్ణవేణి కాలి నడకన ఇంటికి బయల్దేరింది. స్థానిక కళాభారతి ఆడిటోరియం వద్దకు రాగానే, కృష్ణవేణిపై అగంతకుడు దాడి చేసి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఈ దాడికి పాల్పడింది కృష్ణవేణి భర్తేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుపారిపోయాడని స్థానికులు చెపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.

Wednesday 2 March 2011

దీక్షావివేకి


ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాజకీయనాయకులు ఎంచుకునే మార్గం దీక్ష. ఏదైనా డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గనప్పుడు దీక్షలకు దిగడం సాధారణం. ఎంతోమంది ఇలా చేసే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ, ఇప్పుడో దీక్షాదక్షుడు వచ్చాడు. అతడే జగన్. ఆయన చేస్తున్న దీక్షలే ఇప్పుడు హాట్ టాపిక్..ఫీజు చెల్లింపుల కోసం వారం రోజుల పాటు దీక్షకు దిగిన జగన్.. చివరకు నిమ్మరసం తాగి విరమించారు. కానీ, విరమిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన దీక్షను పట్టించుకోలేదన్నారు. జగన్ వర్గం కూడా ఈ వారంరోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ దుమ్మెత్తిపోశారు. కానీ, అక్కడే అసలు విషయాన్ని వారు గుర్తించలేరు. ఒక్కరోజు, రెండు రోజుల దీక్షలు చేస్తూ వచ్చిన జగన్ .. ఫీజు కోసమూ ముందు ఒక్కరోజే దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇలా దీక్ష ఎన్నిరోజులు చేస్తామన్నది ప్రకటించి చేయడం సమకాలీన రాజకీయాల్లో ఒక్కజగన్‌కే చెల్లింది. ఎంత వివేకం లేని రాజకీయనాయకుడైనా ముందుగానే ముగింపు రోజును ముందుగానే ప్రకటించి దీక్షకు దిగలేదు. కానీ, జగన్‌కు బహుశా వివేకం ఎక్కువనుకుంటా.. అందుకే ముందుగానే తాను విరమించే రోజునూ ప్రకటించేశారు. ఎలాగూ వారంరోజుల్లో ముగిసిపోతుందని తెలిసినప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా..? సరిగ్గా అదే జరిగింది. అనుకున్నట్లే జగన్ దీక్షా శిబిరాన్ని ఎత్తేశారు. అయితే, ఈ వారం రోజుల్లో ఎలాగైనా ప్రభుత్వం తనతో దీక్షను విరమింపజేస్తుందని ఆయన భావించారు. అది జరగలేదు. ఇక 24వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామంటూ జగన్ వర్గం ప్రకటించింది. కానీ, బడ్జెట్ తర్వాత రోజు అసెంబ్లీకి సెలవన్న విషయం మర్చిపోయింది. మొత్తంమీద రాజకీయంగా జగన్ ఇంకా ఎదగలేదన్న విషయం ఈ దీక్షతో మరోసారి తేలిపోయింది....