Monday, 11 April 2011

దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది...???


దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది.. కదా.. మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం ఎందుకో....? నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి ....?
ఆయనో గోప్ప........ దేముడు.. సానా గొప్ప పేరు 'సంపాదించాడు'... విదేశాలనుంచి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు... దేశ అగ్రనేతలు.. కూడా ఆయన పాదా క్రాంతులవుతారు.. ఎందుకంటే.. దేముడు కదా మరి.. తను.. గాల్లో చేతులు తిప్పి ఉంగరాలు.. విభూది ఉండలు తీయగలడు.. అతను చేతివేలు పెడితే నీళ్లు కూడా... పెట్రోల్‌ అవుతుంది.... అతను సాక్ష్యాత్‌ దైవాంశ సంభూతుడు... సంభూతుడేంటి దైవమే... మరి అలాంటి వ్యక్తితి ఆరోగ్యం కరాబ్‌గావడమేందో నా దిమాక్‌కు తట్టలే... ఎందుకంటారా.. ఏడనన్న దేవుడికి జరమొస్తాది సెప్పుండ్రి... తన జంతర్‌ మంతర్‌ మాటలతో... ఎంతో సంపాదించాడు.. (పేరు ప్రతిష్టలు) కొంత పేదలకూ.. పెడుతున్నాడు... అది మంచి పనే అనుకోండి... కానీ దేవుడే కదా ఒక చూమంతరమేసుకుంటే పోతది కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కాస్లీ వైద్యం అందిస్తే ఆరో(గం)గ్యం కాస్త కుదుట పడిందంటా... మరి దేవుడికి జ్వరం రాదు ఇతనికి జ్వరం వచ్చింది.. అంటే... ఇతడు దేవుడు కాడనా... లేక దేవుడికి కూడా జ్వరమొస్తదనా.... లేక గజం మిథ్య పలాయనం మిథ్యనా...
నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి 
.....................................సుందర్

1. రామకృష్ణ పరమ హంస కాన్సుర్ తో బాధ పడ్డారు ఎందుకు?

2. రమణ మహర్షి ఎందుకు వ్యాది గ్రస్తుడు అయ్యారు?
3. రాముడు ఎందుకు అడవుల వెంట తిరిగాడు?
4. కృష్ణుడు బాణం తో ఎందుకు చనిపోయాడు?
5. సతీ దేవి చనిపోయిందని శివుడు ఎందుకు బాధ పడ్డాడు? శివుడు బతికిన్చాలేకా?
6. వెంకన్న బాబుకు, గద్దపలుగు తగిలి దెబ్బ తగిలిందా? నీల దేవి జుట్టు సమర్పించుకోవాల? వెంకన్న జుట్టు పెంచుకోలేడా?
7.దేవుడికి డబ్బులు ఎందుకు? చేతితోనే బంగారు నాణేలు సృష్టించుకోగలడు.
సాయి భావంతుదని నేను నమ్మను. అయన చేసే చాల పద్దతులను నేను కూడా కామెడీ చేస్తాను. కాని బాధ అనేది దివాత్వం అనేది వేరు.

No comments:

Post a Comment