Saturday 14 May 2011

కాంగ్రెస్‌లో కలవరం


న్యూఢిల్లీ, మే 13: కడప లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారీ మెజారిటీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. జగన్ దాదాపు ఐదు లక్షల యాభై వేల మెజారిటీతో అద్భుత విజయం సాధించటం, ఆయన తల్లి విజయలక్ష్మి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 86 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్, విజయలక్ష్మిలకు మెజారిటీ వస్తుందని హైకమాండ్ అంచనా వేసింది. కానీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించలేకపోయారు. ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఐదున్నర లక్షల మెజారిటీతో లోక్‌సభకు మళ్లీ ఎన్నికల కావడం ఎటు దారితీస్తుందనేది అధినాయకత్వానికి అర్థం కావటం లేదు. ఒక వైపు జగన్ రాజకీయం మరోవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ అధినాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ సమస్యను పరిష్కరించలేకున్నా జగన్ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ని కాంగ్రెస్‌లోకి తెప్పించుకునేందుకు ప్రమత్నించటం ద్వారా ఈసమస్యను పరిష్కరించుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాలను విశే్లషించిన అనంతరం కొందరు విలేఖరులతో అనధికారికంగా మాట్లాడుతూ జగన్‌ని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలిసింది. జగన్‌ని వదులుకోవటమే మొదటి తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారని అంటున్నారు. జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళకుండా చూడవలసిందని కూడా ఆయన అన్నట్లు తెలిసింది. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోగా ఈ లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుందని ఆజాద్ అన్నట్లు తెలిసింది.

బుద్ధి తెచ్చుకుని మసలుకోండి


న్యూఢిల్లీ, మే 13: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాతనైనా బిజెపి, వామపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు. కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని అన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం అధిపతి జనార్దన్ ద్వివేదీతో కలిసి ప్రణబ్ విలేఖర్లతో మాట్లాడారు. ఏఐసిసిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి, వామపక్షాలపై దుమ్మెత్తిపోశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు మార్పును కోరుకున్నారు. అస్సాం ప్రజలు స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా తమ తీర్పు ఇచ్చారని ప్రణబ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బిజెపి ఈ అవకాశం కోసం వేచి చూడాలి. అయితే యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని, వ్యవస్థను అస్థిర పరచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలో దాదాపు 824 సీట్లు ఉన్నాయి. బిజెపి ఈ సీట్లన్నింటిలో తమ అభ్యర్థులను నిలబెట్టకపోయినా ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. వారికి మిగిలింది ఏమిటని ప్రణబ్ నిలదీశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క సీటు కూడా రాలేదు. బెంగాల్‌లో ఒక్క సీటు వస్తే అస్సాంలో ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద వారి సీట్ల సంఖ్య రెండంకెల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి 2008లోనే అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుని మమతా బెనర్జీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది మమతా బెనర్జీ విజయమని ఆయన అంగీకరించారు. ఇక వామపక్షాల బలం మూడంకెల నుండి రెండు అంకెలకు తగ్గిపోయిందన్నారు. అస్సాంలో కాంగ్రెస్ బలం 53 నుండి 78 పెరగటం పట్ల ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ శిరసావహిస్తుందని చెబుతూ తమ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన డిఎంకెతో సంబంధాలు యథాతధంగా కొనసాగుతాయా? అన్న ప్రశ్నపై ప్రణబ్ మాట్లాడుతూ ఫలితాలు ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన తమ స్నేహంలో ఎలాంటి మార్పు రాదన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అత్యంత సహజమన్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీ శతృవుకాదు, అందరితో స్నేహం చేస్తామని తెలిపారు. అలాగని ఓడిపోయినంత మాత్రాన ఒకప్పుడు లోక్‌సభలో కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న బిజెపి ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి రాలేదా? అని ఆయన ప్రశ్నించారు.

మెజార్టీలో రికార్డు



కడప, మే 13:కడప ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన జగన్మోహన్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. అదే విధంగా పులివెందుల శాసనసభకు పోటీచేసి గెలిచిన దివంగత నేత వైఎస్ సతీమణి విజయలక్ష్మి సైతం భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల మెజారిటీ సాధించిన జగన్మోహన్‌రెడ్డి దేశంలో మూడవ స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. రామ్‌విలాస్ పాశ్వాన్ 7 లక్షల రికార్డు మెజార్టీతో మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో రెండవ స్థానంలో నిలిచారు. జగన్ తాజాగా 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో మూడవ స్థానంలో నిలిచారు. జగన్ తన తండ్రి రికార్డును సైతం బద్దలు కొట్టారు. రాజీవ్ మృతితో 1991లో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి కడప లోక్‌సభకు పోటీచేసి 4.18 లక్షల మెజారిటీ సాధించారు. అప్పట్లో ఇది రికార్డు. అదే విధంగా కడప లోక్‌సభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక రికార్డు. రాష్ట్రంలో ఈ మెజార్టీ రికార్డు కావడం మరో విశేషం. ఇక పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించిన విజయమ్మ తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రికార్డును బద్దలుకొట్టారు. 2009లో రాజశేఖర్‌రెడ్డికి 68,681 ఓట్ల మెజారిటీ రాగా, తాజా ఉప ఎన్నికల్లో విజయమ్మకు 85,191 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ నియోజక వర్గంలో గతంలో ఎవరు ఇంత మెజార్టీ సాధించిన దాఖలాలు లేవు.
విజయోత్సవాలు
కడప ఉప ఎన్నికల్లో జగన్, ఆయన తల్లి విజయం సాధించడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కడప లోక్‌సభకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పులివెందుల శాసనసభకు వైఎస్ విజయమ్మ గెలిచినట్లు ప్రకటించగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జగన్‌కు జై. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టుకుని మోటార్‌బైక్‌లపై ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మొదటి మూడు రౌండ్లు ఓట్ల లెక్కింపులోనే జగన్, విజయమ్మ లీడింగ్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడగానే జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ పెరుగుతూ రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. చివరకు జగన్మోహన్‌రెడ్డి, విజయమ్మ భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించగానే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దమొత్తంలో బాణసంచా పేల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జెఎంజె కౌంటింగ్ కేంద్రం బయట రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వైయస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మద్రాసు రహదారిపై నృత్యాలు చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
కడప గడపలో వరుసగా వైఎస్ కుటుంబానిదే విజయం
కడప, మే 13: కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ కుటుంబం మరోసారి విజయం సాధించింది. 1989 నుంచి జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.వి. రమణారెడ్డిపై లక్షా 66 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో పోటీచేసిన రాజశేఖర్‌రెడ్డి టిడిపి అభ్యర్థి సి.రామచంద్రయ్యపై 4.18 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన వైఎస్ టిడిపి తరపున పోటీచేసిన కందుల రాజమోహన్‌రెడ్డిని ఢీ కొన్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా కందుల రాజమోహన్‌రెడ్డిపై 5,445 ఓట్ల మెజారిటీ సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నేత కందుల రాజమోహన్‌రెడ్డిపై 26,500 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004 ఎన్నికల్లో వివేకానందరెడ్డి మరోసారి పోటీ చేశారు. టిడిపి తరఫున పోటీచేసిన కందుల రాజమోహన్‌రెడ్డిపై లక్షా 40 వేల మెజార్టీ సాధించారు. 2009లో జగన్మోహన్‌రెడ్డి టిడిపి అభ్యర్థి పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై లక్షా 75 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తాజా ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిపై 5 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించారు. (చిత్రం) ఎన్నికల అధికారినుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్ 

నాన్న, ప్రజలు ఆశీర్వదించారు:జగన్


వేంపల్లె, మే 13: ఉప ఎన్నికల్లో పోటీచేసిన తనను, తన తల్లి విజయమ్మను నాన్న, కడప ప్రజలు ఆశీర్వదించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ విజేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కడప ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి తమను ఆశీర్వదించారని అన్నారు. కడప ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియగానే వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న జగన్మోహన్‌రెడ్డి తన తండ్రికి నివాళులర్పించారు. జగన్‌ను కలిసేందుకు ఇడుపులపాయకు వేలాది మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. నీ వెంటే మేమంటూ ప్రజలు నినాదాలు చేశారు. భవిష్యత్తు మనదేనంటూ కేరింతలు కొట్టారు. వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు జగన్ చేరుకొన్నారు. ఆయన వెంట రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తదితర శాసన సభ్యులు, నాయకులు ఉన్నారు. (చిత్రం) ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న జగన్ మోహన్‌రెడ్డి

Wednesday 4 May 2011

పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతి ఆత్మహత్య

మాడుగుల, మే 4: ప్రేమించానని నమ్మించి శారీరక సంబంధం సైతం పెట్టుకుని పెళ్లికి నిరాకరించిన ప్రియుడి మోసాన్ని తట్టుకోలేని ఓ యువతి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి మూడో నెల గర్భవతిగా తెలుస్తోంది. మాడుగుల పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం మాడుగులలోని దొర్లవీధికి చెందిన పిల్లి భీముడునాయుడు (నాని) (24), గవరవీధికి చెందిన దుంగా లక్ష్మీదేవి (22) గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడిన వీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవడమే కాకుండా వీరిద్దరూ గతంలో ఫొటోను సైతం తీయించుకున్నారు. లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటానని నమ్మించిన నాని ఆమెతో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. దీంతో లక్ష్మీదేవి మూడుసార్లు గర్భ దాల్చడంతో నాని దగ్గరుండి అబార్షన్ చేయించినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకునే వరకు ఇటువంటివి మంచివి కావని నమ్మించిన నాని ఆమెతో శారీరక సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం లక్ష్మీదేవి మరోసారి గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే వివాహం చేసుకునేందుకు తనకు ఇష్టమే అయినప్పటికీ తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ప్రియుడు నాని తెగేసి చెప్పాడు. అంతేకాకుండా వేరే అమ్మాయితో వివాహం చేసుకునేందుకు సైతం సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి నానిని ఇటీవల నిలదీయడంతో వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటే కట్నం వస్తుందని, నిన్ను చేసుకుంటే ఏమోస్తుందని ప్రశ్నించినట్టు తెలిసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధాన్ని సైతం ఏర్పరచుకున్న ప్రియుడు ఒకేసారి మాట మార్చడంతో కంగుతిన్న లక్ష్మీదేవి గత నెల 29వ తేదీన మాడుగుల పోలీసులను ఆశ్రయించింది. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ సెలవులో ఉండడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్.తాతబ్బాయి లక్ష్మీదేవి నుంచి ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా వీరిద్దరికీ వివాహం జరిపిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే హామీనైతే ఇచ్చారే తప్పా గత నెల 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో బాధిత యువతి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం కూడా లక్ష్మీదేవి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను మోసగించిన ప్రియుడి విషయమై ఏం చేశారంటూ ఎ.ఎస్.ఐ.ని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. దీంతో నానిని ఎ.ఎస్.ఐ. తాతబ్బాయి పిలిపించి విచారించినట్టు తెలుస్తోంది. అయితే తమ కుమారుడు ఎట్టి పరిస్థితులలోనూ లక్ష్మీదేవిని వివాహం చేసుకునేందుకు అంగీకరించేది లేదని నాని తల్లిదండ్రులు సత్తిబాబు, మంగ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో నాని కూడా తాను ప్రేమించిన యువతిని పెళ్లాడేది లేదంటూ తేల్చి చెప్పాడు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించిన ప్రియుడు తనను గర్భవతిని చేసి మోసం చేయడాన్ని తట్టుకోలేని లక్ష్మీదేవి తనతో తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసుల సమక్షంలోనే లక్ష్మీదేవి పురుగుల మందు సేవించడంతో నిశే్చష్టులైన ఆమె బంధువులు వెంటనే దగ్గరలోనే ఉన్న సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లగానే ఆమె మృతి చెందింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలం కలిగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.శేషు హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రేమించిన యువతిని మోసం చేసిన ప్రియుడు నానితోపాటు ఆయన తల్లిదండ్రులు సత్తిబాబు, మంగలను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ముగ్గురిపై ఐ.పి.ఎస్. 417, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. యువతి మృతదేహన్ని పంచనామాకు తరలించారు.

Tuesday 12 April 2011

వైభవంగా సీతారాముల కల్యాణం


వైభవంగా సీతారాముల కల్యాణం






వైభవంగా సీతారాముల కల్యాణం
భద్రాచలం : భూలోక వైకుంఠమైన భద్ర గిరిలో మంగళవారం శ్రీసీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. 

ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి.

కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నిండు గంటలకు కళ్యాణం జరిగింది. రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలో భాగంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధీ సేవ నిర్వహిస్తారు.

భద్రాద్రిలో పెళ్లి సందడి

వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో భద్రాద్రిలో పెళ్లిసందడి నెలకొంది. భద్రాద్రి పురవీధులన్నీ జనసంద్రంగా మారాయి. 12సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే భద్రాచలం చేరుకున్న భక్తులు పావన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ తర్వాత రామాలయాన్ని దర్శించుకున్నారు . 

ముత్యాల తలంబ్రాలతో సీఎం
ప్రభుత్వం తరఫున సీతారాముల పెళ్లికి,పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి సమర్పించారు. సీఎం రాక సందర్భంగా భద్రాచలంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ చౌహాన్ భద్రతపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Monday 11 April 2011

దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది...???


దేవుడికి జ్వరమొస్తే చూమంతరకాళి అంటే పోతుంది.. కదా.. మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం ఎందుకో....? నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి ....?
ఆయనో గోప్ప........ దేముడు.. సానా గొప్ప పేరు 'సంపాదించాడు'... విదేశాలనుంచి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు... దేశ అగ్రనేతలు.. కూడా ఆయన పాదా క్రాంతులవుతారు.. ఎందుకంటే.. దేముడు కదా మరి.. తను.. గాల్లో చేతులు తిప్పి ఉంగరాలు.. విభూది ఉండలు తీయగలడు.. అతను చేతివేలు పెడితే నీళ్లు కూడా... పెట్రోల్‌ అవుతుంది.... అతను సాక్ష్యాత్‌ దైవాంశ సంభూతుడు... సంభూతుడేంటి దైవమే... మరి అలాంటి వ్యక్తితి ఆరోగ్యం కరాబ్‌గావడమేందో నా దిమాక్‌కు తట్టలే... ఎందుకంటారా.. ఏడనన్న దేవుడికి జరమొస్తాది సెప్పుండ్రి... తన జంతర్‌ మంతర్‌ మాటలతో... ఎంతో సంపాదించాడు.. (పేరు ప్రతిష్టలు) కొంత పేదలకూ.. పెడుతున్నాడు... అది మంచి పనే అనుకోండి... కానీ దేవుడే కదా ఒక చూమంతరమేసుకుంటే పోతది కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కాస్లీ వైద్యం అందిస్తే ఆరో(గం)గ్యం కాస్త కుదుట పడిందంటా... మరి దేవుడికి జ్వరం రాదు ఇతనికి జ్వరం వచ్చింది.. అంటే... ఇతడు దేవుడు కాడనా... లేక దేవుడికి కూడా జ్వరమొస్తదనా.... లేక గజం మిథ్య పలాయనం మిథ్యనా...
నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి 
.....................................సుందర్

1. రామకృష్ణ పరమ హంస కాన్సుర్ తో బాధ పడ్డారు ఎందుకు?

2. రమణ మహర్షి ఎందుకు వ్యాది గ్రస్తుడు అయ్యారు?
3. రాముడు ఎందుకు అడవుల వెంట తిరిగాడు?
4. కృష్ణుడు బాణం తో ఎందుకు చనిపోయాడు?
5. సతీ దేవి చనిపోయిందని శివుడు ఎందుకు బాధ పడ్డాడు? శివుడు బతికిన్చాలేకా?
6. వెంకన్న బాబుకు, గద్దపలుగు తగిలి దెబ్బ తగిలిందా? నీల దేవి జుట్టు సమర్పించుకోవాల? వెంకన్న జుట్టు పెంచుకోలేడా?
7.దేవుడికి డబ్బులు ఎందుకు? చేతితోనే బంగారు నాణేలు సృష్టించుకోగలడు.
సాయి భావంతుదని నేను నమ్మను. అయన చేసే చాల పద్దతులను నేను కూడా కామెడీ చేస్తాను. కాని బాధ అనేది దివాత్వం అనేది వేరు.

Saturday 9 April 2011

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?



TUESDAY, APRIL 5, 2011

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?


తరచుగా ఒక ప్రశ్న వేస్తుంటారు - అది, బాబావారు తామే అద్భుత రీతిలో రోగాలకు చికిత్స చేసి మాన్చుతున్నప్పుడు, పుట్టపర్తిలో డాక్టర్లతోను, ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నవాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాలనేకాక విజ్ఞాన శాస్త్రాలనుకూడా దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని ఆర్జించుకోవాలి. రష్యాలో అధిమనో విజ్ఞాన శాస్త్రాన్ని (శసశూా-ఠుుగా) ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ అతిమానుషమయిన (కార్య కారణ సంబంధం లేకుండా దైవశక్తితో కూడిన) కొన్ని విషయాలమీద ఆకట్టుకొనే ప్రయోగాలను జరిపారు. వాటిని గురించి ఇటీవల అమెరికాలో ఒక తక్కువ వెల పుస్తకం ప్రచురింపబడింది. ప్రశాంతి నిలయంవంటి ఆశ్రమాలలోని డాక్టర్లు ఆధ్యాత్మిక నేపథ్యంతో వైద్య చికిత్సలు చేయాలి. డాక్టర్లు ఒక జబ్బును నిర్ధారించి దానికి చికిత్స ఎట్లా చేయాలో నిర్ణయించటానికి మందు ఆ జబ్బుమీద అంతర్‌ బుద్ధిని ప్రయోగించాలి. అప్పుడే ఆ జబ్బు వివరాలను, దానికి సంబంధించిన సూక్ష్మాంశాలను గుర్తించడంలో అతని విజ్ఞానశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. అనుగ్రహంయొక్క పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి.
డా|| సామ్యుయెల్‌ హెచ్‌. సాండ్‌వైస్‌, ఎం.డి., అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కేలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌డీగో విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసరేకాక, మనో వైజ్ఞానిక (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌గా కూడా వృత్తిని నిర్వహిస్తున్న వాడు. ఆయన రాసిన 'సాయిబాబా, ది హోలీ మ్యాన్‌ అన్‌డ్‌ ది సైకియాట్రిస్ట్‌' అన్న గ్రంథం ఎంతో ఆకట్టుకొంటున్న గ్రంథం. మనో విజ్ఞాన మూలాల్ని తెలుపుతూ ఒక ఆకర్షకమైన కథనం అందులో ఉన్నది. మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్తున్న శాస్త్రం ఒక అసమగ్రమైన శాస్త్రమనీ, దాన్ని నిజంగా ప్రభావవంతం చేయాలంటే, ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఎన్నో విషయాలను అందులో చేర్చాల్సి ఉంటుందని ఆయన నిశ్చితంగా చెప్పాడు. ఈ గ్రంథంలో డా|| సాండ్‌వైస్‌ తనకు బాబాతో కలిగిన అనుభవాలనుకూడా వివరించారు. మొట్టమొదట తను 'అనిశ్చితి', 'అనిర్ణయత' ఉన్నవాడిననీ, అధ్యాత్మక వెలుగులో తాను మారానన్నారు. తన నాస్తికపు సంశయాత్మక బుద్ధిని ఎంతమేరకు వెళ్ళగలదో అంతమేరకు వెళ్ళనిచ్చాననీ, ఐతే అట్లా సంశయించడంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నప్పటికీ, అది ఆత్మయొక్క ఉనికినీ, ఆధ్యాత్మిక సత్యాన్నీ అంగీకరిస్తుందన్నారు. తన వృత్తిమీదకూడా తనకున్న దృష్టిలో మార్పు వచ్చిందంటారు, సాండ్‌వైస్‌.
మతపరమైన మనో విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఒక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా అధ్యయనం చేయటానికి ఆయన భారత దేశానికి వచ్చారు. చిత్‌శక్తి శాస్త్ర పునాదిమీద ఆధారపడి, మనోవిజ్ఞాన చికిత్సా విధాన శాస్త్రమే తన రోగ చికిత్సా పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు.
నిపుణుల కమిటీ ఒకటి బాబావారి మిరకిల్స్‌ (అద్భుతాల)ను గురించి ప్రత్యక్షంగా అధ్యయనం చేయడంకోసం పుట్టపర్తికి వచ్చిందని నాల్గవ అధ్యాయనంలో రాశాను ('ది ఎడ్వెంట్‌ ఆఫ్‌ సత్యసాయి' -అన్న గ్రంథంలో) వారు అమెరికాలోని చెస్టర్‌ ఎఫ్‌. కార్ల్‌సన్‌ రీసెర్చి లేబొరేటరీకి చెందినవారు. ఇందులోని ఇద్దరు మనో విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు. ఊాతో పాటు ాఒ కి చెందిన అంశాలను అధ్యయనం చేయడానికే ఈ లేబొరేటరీ (ప్రయోగశాల)ని వ్యవస్థాపించారు. (ఊా మరియు ాఒ లు అతీంద్రియ జ్ఞానాన్ని శాస్త్రీయంగా పరిశోధించి తెలిపే శాస్త్రాంశాలు). ఇద్దరు శాస్త్రవేత్తలు - ఒకరు డాక్టర్‌ కార్లిస్‌ ఇసిస్‌. వీరు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చికి డైరెక్టరు. మరొకరు ఎర్‌టెన్‌డుర్‌ హరాల్డ్‌సన్‌ - ఐస్‌ల్యాండ్‌ యూనివర్శిటీకి చెందినవారు. బాబాను అధ్యయనం చేశాక వీరిద్దరూ వైదుష్యంతో కూడిన కొన్ని అంశాలతోఒక పరిశోధన పత్రాన్ని 'శ్రీ సత్యసాయిబాబావారికి సంబంధించిన ఐదు దేహాంతర కేసులు' అన్నదాన్ని రాశారు. (వీటిని క్షఇఊ అంటారు. అంటే క్షషష ుౌ ఇుdా ఊూ|స|n-| అని అర్థం. దేహం నుంచి తాను బైటకు వెళ్ళి జరిపే పనులని అర్థం). వీరి ఈ అధ్యయనాన్ని గమనిస్తే వీరికి చురుకయిన, సంకుచితం కాని మనస్సే కాక, తాము అధ్యయనం చేయదలచుకొన్న ఆధ్యాత్మికమైన మిరకిల్స్‌ మీద గౌరవం ఉన్న విషయాన్నిచూడ గల్గుతాము. అలాంటి అనుభవాలవద్దకు అవి దొంగవనో, అబద్ధమనో (ముందే ఏర్పరచుకొన్న) నిర్ణయాలతో వీరు వెళ్ళలేదు. ఈ అసాధారణ విషయాలను తమ పత్రంలో వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీటిని తెలుపడానికి తగిన పరిభాషా శబ్దాలనుకూడా వీరు సిద్ధం చేసికొన్నారు. ఇది విశేషమయిన ప్రత్యేక శాస్త్రం. సాహిత్యాన్నో, సాంఘిక, భౌతిక విజ్ఞాన శాస్త్రాలనో అధ్యయనం చేస్తే ఈ జ్ఞానాన్ని పొందలేము. ఈ పరిశోధక పత్రంలో వీరు ఆధారపడిన గ్రంథ, వ్యాస సూచికల పట్టికను పరిశీలిస్తే, వీరికి అద్యతన అధిమనో విజ్ఞాన శాస్త్రంతోనూ (పేరాసైకాలజీ), భారతీ యులూ, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ రచయితలూ బాబావారిని గురించి రాసిన రచనలతోనూ ఎంతటి గాడమైన విద్వత్తూ పరిచయమూ ఉన్నవో తెలస్తుంది. ాఒ పరిశోధనలకు ఆ శాస్త్రానికే పరిమితమైన సొంత పరిశోధన పద్ధతులున్నాయి. అధిమనో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం లేకుండా, కనీసం ఆ పద్ధతులను గురించి దిఙ్మాత్ర పరిచయమైనా లేకుండా ఎవరయినా ఇలాంటి పరిశోధనలకు పూనుకుంటే, అది సాహసమే అవుతుంది.
తమ పత్రాన్ని గురించి ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఇట్లా అన్నారు ''ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించి, తమ అనుచరులు ఈ (మా) పరిశోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించినందుకు శ్రీ సత్యసాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఇంటర్వ్యూల నిర్వహణలో తోడ్పడిన సాక్షులకూ, ఇతరులకూ హృదయపూర్వకమయిన కృతజ్ఞతలు''.
ఈ పరిశోధన పత్రం నుంచి కొన్ని ఉదాహరణలు:
''కేవలం ప్రఖ్యాతులయిన వ్యక్తులూ, శాస్త్రజ్ఞులూ, పారిశ్రామికవేత్తలూ, రాజకీయనాయకుల కోసం కాకుండా, వీరి క్షఇఊ (దేహాంతర అనుభవం) పొందాల్సిన వ్యక్తికి కల్గిన ఆత్యయిక పరిస్థితి (జబ్బూ, నిస్పృహా మొదలైనవి) వల్లనే కలిగింది. కేవలం అవసరం వల్లనే బాబావారి క్షఇఊ (దేహాంతర అనుభవం) అగుపించినందువల్ల మా పరిశోధనల్లో వారిని పాల్గొనేటట్లు చేయడానికి మాకు అత్యల్ప అవకాశమే ఉన్నదని గ్రహించాము. ఐతే, వారు మాకోసంగాను అనేక సందర్భాలలో వస్తువులు అగుపించడం, మాయమవడం వంటివాటిని చూపించారు....''
ఈ నిపుణులు ఆకర్షకమైన కేసులను అన్వేషించే కార్యక్రమంలో, మూడుసార్లు భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలను చూశారు. 1973లో వారు చేసిన మూడవ పర్యటనలో వారికి బాబా విషయం తెలిసి వారిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలనిపించినట్లుగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయిన ఒక వృద్ధురాలైన భక్తురాలికి బాబావారు ప్రత్యక్షం కావడాన్ని గురించి వీరీ పత్రంలో తెలిపారు: మద్రాసు సమీపంలో ఉన్న వెంకటగిరిలో ఉంటూనే శైలజ అన్న ఒక చిన్నపిల్ల ప్రార్థనవల్ల కాలికట్‌ సమాపంలోని మంజేరీలో శరీరంతో అగుపించి కొన్ని గంటలు భజన, సంభాషణ చేయడంగురించి ఇందులో వీళ్ళు తెలిపారు.
(వారి మాటల్లో ''మంజేరీ విషయంగా మేము బాబావారిని ప్రశ్నించాము. రెండు సందర్భాలలో 'తాను' దేహం విడిచి రావు కుటుంబంతో ఉన్నట్లుగా ధృవీకరించడం చాలా క్లుప్తంగా చేశారు.'')
ముగ్గురు దుబాసీల సహాయంతో వీళ్ళు 21 మంది సాక్షులను పరీక్షించినట్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఏయే అంశాలను పరీక్షించాలో ఆరు పట్టికల్లో రాసికొన్నారు. ఈ నిపుణులు ఇంకా వివరిస్తూ -''దేశ దిమ్మరి సన్న్యాసులవలె సాయిబాబా భిక్షమడగరు. ఏమీ కోరరు. పోగా వారే ఇతరులకు సాయం చేస్తుంటారు'' అని తెలిపారు. బావిలో పడి మునిగిపోతున్న ఒక మనిషిని సాయమం దించేవాళ్ళు వచ్చేదాకా తానే సూక్ష్మ శరీరంతో ఎత్తి ఉంచిన కుప్పం సంఘటనను గురించి చర్చిస్తూ ఈ నిపుణులు ''ఇది క్షఇఊ అంశం. ఊా (ఊషసశ ా|nుసా |స-|ూషుn -అంతీంద్రియ గ్రమణం) కన్నా విశేషమైనది'' అని అంటూ ''బాబా తమని అవతారంగా భావించే - వారి అనుయాయులకు అనేకానేక ఊా శక్తులను ఖచ్చితంగా ప్రదర్శించారు. వారి ఊా శక్తిని మేము కూడా స్వయంగా చూశాము. ఊఐ కు (అతని స్వదేశమయిన) ఐస్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రత్యేక సందర్భాలను సరిగ్గా పేర్కొన్నారు'' అని అన్నారు. ఆ విషయాన్ని గురించి వీళ్ళు ''బాబా చెప్పినవి క్షఇఊ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
తమ పరిశోధన పత్రం ముగింపుగా వీరు ''అరవై లక్షల భారతీయ భక్తులు శ్రీ సత్యసాయిబాబా ఒక విశేష లక్షణ వ్యక్తిగా, అవతారంగా భావించడం విషయంలో మనం దాని సంభావ్యతనుగురించి సానుకూల మనస్కతతో ఉండాలి. పోగా, ఈ కేసులు ఆయనను గురించి ప్రత్యేకంగా తెలియపరిచేవేగాని భారతీయ సంస్కృతినిగురించి తెలిపేవి కావు. వీరికి సంబంధించిన ఈ కేసులు పాశ్చాత్య దేశాల కేసుల కన్నాకూడా ఖచ్చితంగా విల క్షణమయినవి. అసా ధారణమైనవాటిని గురించి తెలిసికోవడానికి ఇవి ఎక్కువ వీలు కల్గిస్తున్నట్లుగా అగుపిస్తున్నది'' అని రాశారు. వీటన్నిటివల్ల శరీరంతోనూ, క్షఇఊ పద్ధతుల ద్వారానూ బాబావారు సామాన్య మానవునికి ఎట్లా సాయం చేస్తున్నారన్న విషయం పాఠకులకు తేటతెల్లమవుతుంది.
ాఒ శాస్త్రాన్ని (క్షఇఊ, ఊా మొదలైనవి) అధ్యయనం చేయాలని కోరుకొనే వ్యక్తులు ఇది అత్యంత నూతన విజ్ఞానశాస్త్రమనీ, ప్రపంచంలో ఎంతో అభివృద్ధి పొందిన దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధించడానికి ప్రయోగశాలలూ, యూనివర్శిటీలూ స్థాపించారనీ గమనించాలి.పైన పేర్కొన్న పత్రం నుంచి అక్కడక్కడ ఉటంకించిన కొన్ని కొటేషన్లుకూడా ఈ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైందనీ, దీని పద్ధతులు వేరనీ, వీటిని అనుసరించి పరిశోధనలు జరిపినప్పుడే సత్యం ఆవిష్కారమవుతందనీ తెలుపుతాయి. ఏదో ఒక అంశంలోనైనా అనుభవాలను గురించిన ఈ ప్రయోగశాలల్లోకూడా తప్పులు జరుగవచ్చు. ఈ క్షేత్రంలో పని చేయడానికి భారతదేశంలో ఎందరికి శిక్షణ ఉన్నది? ఎందరు యోగ్యతా, అర్హతా 

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్‌కు ‘గుడ్‌బై


అరకులోయ, ఏప్రిల్ 9: కడప, పులివెందులలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి ‘గుడ్‌బై’ చెప్పనున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి వెల్లడించారు. అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్న తాను ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. కడప, పులివెందుల స్థానాల్లో నుంచి ఎన్నికల బరిలో ఉన్న విజయమ్మ, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందినట్టు ప్రకటన వెలువడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటానని ఆయన తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని, అంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన చేరికపై వేచి ఉండకతప్పదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను దాదాపు 40 వరకు ఆవిష్కరించానని ఆయన చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో తన చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. తనయుడు, కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని కొంతమంది నాయకులను అప్పట్లో తాను హెచ్చరించినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీని వీడితే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలవుతుందని అప్పట్లో తాను చెప్పిన మాటలు నేడు సత్యరూపం దాల్చాయన్నారు. తానెప్పుడూ స్థానిక నాయకులను గౌరవిస్తానని, అదేవిధంగా కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తానని, అయితే ఇందుకు భిన్నంగా మన్యం వాసులు వ్యవహరిస్తుండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక నాయకులను వీడి ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చే నేతలను ఈ ప్రాంతం వారు గౌరవించడం ఆశ్చర్యకరంగా ఉందని సబ్బం హరి పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనుల అండదండలతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల పరిరక్షణ కోసం పోరాడుతానన్నారు. రాజకీయంగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విజయమ్మ, జగన్మోహన్‌రెడ్డిల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపుకు ప్రతీఒక్క గిరిజనుడూ తమవంతు కృషిచేయాలని ఆయన కోరారు. రానున్న కాలంలో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నియోజకవర్గ ప్రజలు బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం మార్చేస్తుందని కుంభా రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమారాణి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, రఘురాజు, పోతురాజు, పాంగి చిన్నారావు, విజయ్‌కుమార్, బూర్జబారికి జగ్గన్న, పి.కొండలరావు, శెట్టి ఆనందరావు, శోభా వీరభద్రరాజు, గుడివాడ ప్రకాశ్‌రావు, వెచ్చంగి పద్మ, వెచ్చంగి గంతన్న, కాసులమ్మ, కొండబాబు, పద్మలతో పాటు వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.

నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు



Monday, April 4, 2011

'ఫైర్'తో వస్తున్నా

'ఫైర్'తో వస్తున్నా



ప్యాంటీ లేకుండా మెరిసిన 'సోనాలి బింద్రే


ప్యాంటీ లేకుండా మెరిసిన 'సోనాలి బింద్రే



నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు


నా లేలేత అందాని ఎలాంటి మగాడు తాకుతాడు
లేత ముద్దుగుమ్మ పూనమ్‌కౌర్‌ ఇప్పటి వరకు ఫ్యామిలీ హీెరోయిన్‌గానే కనిపించింది ఇక నుంచి ఆ పాత్రలకు గుడ్‌బై చెప్పిన.... పూనమ్‌కౌర్‌ తన సెక్సీగా ఉంటూ... తన శృంగా తత్వాని బయటపెట్టడనికి రేడి అవుతుంది. ఇక ఫ్యామిలీ హీరోయిన్‌గాక తన అందచందలను చూపిచడానికి సన్నదమవుతుంది.
ఇప్పటి నేను అలషం చేశాను అనుకున్నదేమో కాని నాలో ఇంత సెక్సీతనాన్ని ఉంచుకుని చీర కట్టుకుని సరుకు కనిపించకుండా కూర్చుంటే లాభంలేదంటూ.. తన అందాలను ఆరబోయాటానికి సిద్ధంగా ఉందిటా.. ఈ సారి నుంచి బోల్డగా నటించిన బోలెడంత ఇమేజ్‌ను సొంత చేసుకోవటానికి ఉవిళ్ళుఊరుతుందిటా.. పూనమ్‌. అసలే మన కుర్రళ్ళు ఈ గడసరి సుందరి స్టేమేంట్‌ సంగతి చెవిలోనడ్డితే ఊరుకుంటారా? ఉరుకులు పరుగులు మన హీరోయిన్‌ పూనమ్‌ ఎలాంటి మగాడు తాకుతాడో చూడాలి.లేత ముద్దుగుమ్మ పూనమ్‌కౌర్‌ ఇప్పటి వరకు ఫ్యామిలీ హీెరోయిన్‌గానే కనిపించింది ఇక నుంచి ఆ పాత్రలకు గుడ్‌బై చెప్పిన.... పూనమ్‌కౌర్‌ తన సెక్సీగా ఉంటూ... తన శృంగా తత్వాని బయటపెట్టడనికి రేడి అవుతుంది. ఇక ఫ్యామిలీ హీరోయిన్‌గాక తన అందచందలను చూపిచడానికి 

happy brithday baneeth







Sunday 3 April 2011

కొత్త బిజినెస్‌లోకి నమిత ఎంట్రీ ..???


సదరన్ స్పైస్ నమిత.. సినిమాలకు చెల్లుచీటీ ఇస్తానంటోంది. బరువుబాధ్యతలు పెరిగిపోయి.. కాల్‌షీట్లు మిగిలిపోయి.. ఎటూపాలుపోక.. రిటైర్మెంట్ వైపు చూస్తోంది. అలాగని సినిమాలు మానేసి.. సైలెంట్‌గా కూర్చుంటుందా..? అదీ లేదు.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.. ఏంటా బిజినెస్.. ఏమా కథ..? నమిత అంటే నథింగ్ బట్.. నాటుబాంబు. సినిమా లోపలా బయటా.. మగరాయుడిలా బతికింది. అన్ని దక్షిణాది భాషల్లోనూ చెలరేగి నటించింది. 
రెండో హీరోయిన్‌గా రెండుమాడు సీన్లలో కనిపించినా.. ఐటమ్ గాళ్‌గా ఆరితేరినా అందరిలోనూ కిక్కు రేపింది. పదేళ్లపాటు ఒకే ఫామ్‌ను ఎంజాయ్ చేసింది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అందరు హీరోల సరసనా కనిపించాక.. నమిత దగ్గర స్టాక్ అయిపోయినట్లుంది. బాడీకి బరువు పెరిగి.. మేనికి గ్లామర్ తగ్గి.. ఛాన్సులిచ్చేవాళ్లు మొహం చాటేస్తున్నారు. పాతవాసనలే పెట్టుబడిగా అవకాశాలకు వల విసరాల్సిన పరిస్థితి.
వయసు ఫార్టీప్లస్‌లో పడింది. వెయిటూ వందకు దగ్గరవుతోంది. నమిత సినిమా క్లయిమాక్స్‌కొచ్చినట్లేనని అందరూ కమిటయ్యారు. అందర్లాగే.. నమితది కూడా.. గ్లామర్ వున్నప్పుడే కాసులు ఏరుకోవాలన్న స్ట్రాటజీ. అందుకేనేమో.. రూటు మార్చేసి.. బిజినెస్‌ వైపు స్టెప్పులేస్తోందీ అమ్మడు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి.. ముంబైలో రియలెస్టేట్ బిజినెస్ మొదలుపెడుతోంది. కానీ.. ముంబైలాంటి మహానగరాల్లో లాండ్ కొనడం, అమ్మడం అంటే.. మాటలు కాదు. నమిత దగ్గర ఇంత దమ్ము వుందా..? ఫిల్మీ కొలీగ్స్ అంతా ఇలాగే షాకవుతున్నారు. 

నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి


ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. ఆయన 1950 అక్టోబర్ 10న కృష్ణాజిల్లా కలిదిండిలో జన్మించారు. నూతనప్రసాద్ అసలు పేరు తాడినాడ వర ప్రసాద్.
అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., చలిచీమలు సినిమాలో‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.

రాష్ట్ర జనాభా 8.46 కోట్లు


హైదరాబాద్ : జాతీయ స్థాయిలో చేపట్టిన జనాభా గణన ప్రకారం రాష్ట్ర జనాభా8,46,65,533కి చేరింది. రాష్ట్రంలో జనాభా లెక్కల వివరాలను ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ తెలిపారు.మొత్తం జనాభాలో పురుషుల సంఖ్య 4,25,09,881 కాగా, మహిళల సంఖ్య 4,21,55,652. జనాభా వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ కూడా పాల్గొన్నారు.తాజాగా జరిపిన జన గణన సందర్భంగా ‘నపుంసకుల’ను కూడా గణించారు కానీ వీరిని పురుషుల జాబితాలోనే కలిపారు. వీరి సంఖ్యను తర్వాత వెల్లడిస్తామని అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ఇవి ప్రాథమిక లెక్కలని, పూర్తిస్థాయి లెక్కలు వెల్లడించడానికి మరో ఏడాది సమయం పడుతుందని వివరించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా 7,62,10,007 మాత్రమే. రాష్ట్రంలో జన గణన 2011 ఫిబ్రవరి 9న ప్రారంభించి ఫిబ్రవరి 28న ముగించారు. 2011 మార్చి ఒకటి నుండి ఐదు వరకు రివిజనల్ రౌండ్ లెక్కింపు జరిగింది. 2011 మార్చి 1 ప్రారంభం అయ్యే సమయానికి జన్మించిన ప్రతిశిశువును రెండో పర్యాయం జరిగిన రివిజనల్ రౌండ్ సందర్భంగా లెక్కల్లోకి తీసుకున్నారు. జనాభా గణనలో తొలుత 2010 ఏప్రిల్ 26 నుండి జూన్ 10 వరకు జరిగిన గణనలో ఇళ్ల వివరాలను సేకరించారు. దీని ఆధారంగా జనాభా గణన చేశారు.ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశంలో నాలుగో స్థానంలో ఉండగా జనాభా పరంగా ఐదోస్థానంలో నిలిచింది. జనాభా అత్యధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లాగా రంగారెడ్డి (52,96,396) నిలిచింది. రెండో స్థానంలో తూర్పుగోదావరి (51,51,549), మూడో స్థానంలో గుంటూరు జిల్లా (48,89,230) నిలిచింది. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (23,42,868) నిలిచింది. మహిళల జనాభాలో కూడా రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఈ జిల్లాలో మహిళల సంఖ్య 25,87,702కాగా అతితక్కువ మహిళల జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (11,80,955) నిలిచింది. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభాలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (18,480), అతితక్కువగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ (170) నిలిచాయ.అక్షరాస్యతలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (80.96%) నిలవగా రెండో స్థానంలో రంగారెడ్డి (78.05%), మూడో స్థానంలో కృష్ణా జిల్లా (74.37%) నిలిచాయ. అతితక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (56.06%), ఆ తర్వాతి స్థానంలో విజయనగరం (59.49%) నిలిచాయ. మహిళల విషయం పరిశీలిస్తే మహిళల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాగా హైదరాబాద్ (78.42%), అతితక్కువ ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (45.65%) నమోదయ్యాయ.(చిత్రం) గురువారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో జనగణన వివరాలు వెల్లడిస్తున్న జనగణన శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ. చిత్రంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ ఉన్నారు.

Sunday 20 March 2011

పెట్టుబడి వంద కోట్లు...లాభం రెండు వేల కోట్లు


పరవాడ, మార్చి 19: వంద కోట్ల రూపాయలను పెట్టబడి పెట్టి రెండు వేల కోట్ల రూపాయలను రాంకీ ఇండియా లిమిటెడ్ వెనుకేసుకుందని మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. శనివారం వెనె్నలపాలెంలో గల బండారు స్వగృహంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పరవాడ మండలంలో స్థాపించిన జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటి అభివృద్ధి కార్యక్రమాన్ని రాంకీ యాజమాన్యానికి ప్రభుత్వ అప్పగించింది. ఈ పనులను దక్కించుకున్న రాంకీ యాజమాన్యం నిబంధనలను విస్మరించిందన్నారు. దీంతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకుందని ఆయన ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన విలేఖరులకు వివరించారు. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంతో ఎల్ అండ్ టి సమక్షంలో రాంకీ యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రపంచస్థాయి నాణ్యత గల అధునాతన పరికరాలను ఫార్మాసిటిలో ఏర్పాటు చేయాలని, అభివృద్ధి చేసిన స్థలాన్ని ఎకరాకు 20లక్షల రూపాయల మేర విక్రయించే విధంగా ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం ఫార్మాసిటిలో ఎకరా స్థలం కోటి రూపాయలకు పై బడి విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఫార్మాసిటిలో వచ్చిన లాభాల్లో 41శాతం ప్రభుత్వానికి, 59శాతం రాంకీ యాజమాన్యానికి దక్కే విధంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయితే 2004 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి వరంగా మారిందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వాటాకింద రావాల్సి 41శాతం నిధుల్లో 12 శాతం ప్రభత్వం రాంకీయాజమాన్యానికి మినహాయింపు ఇచ్చిందన్నారు. అలాగే ఆర్ధిక బిడ్ ప్రభుత్వం, రాంకీ సంస్థ అవకతవకలు చేశాయన్నారు. దీని కారణంగా వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనం రాంకీ ఖాతాలోకి వెళ్లిందన్నారు. అలాగే ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో 250 మీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం అది కాస్తా రైతుల భూములపైకి నెట్టిందని ఆయన అన్నారు. ఫార్మాసిటీలోనెలకొల్పిన వ్యర్ధజలాల శుద్ధి కర్మాగారం నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి నాణ్యత పరంగా చేపట్టాలని, అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన రాంకీ వారికి ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణం చేపట్టడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అనుమతులు మంజూరుకు ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చి నిబంధనలు పాటించక పోవడంతో ఇటీవల ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రాంకీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫార్మాసిటిలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్సార్ అల్లుడుతో పాటు రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పరిశ్రమలను స్థాపించారని ఆయన ఆరోపించారు. దీంతో రాంకీ యాజమాన్యం వారి అండ చూసుకొని ఫార్మాసిటిలో పూర్తిగా నిబంధనలను తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. కాలుష్యరహిత ఫార్మాసిటిగా అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి పూర్తి అధికారులను కట్టబెట్టి వారి ఇష్టానుసారంగా వ్యవరించేందుకు సహకరించిందని ఆయన విమర్శించారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కలుగుజేసి కొని తక్షణమే చర్యలు తీసు కోవాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో మండలాధ్యక్షులు మాధంశెట్టి నీలబాబు, కార్మికనేత మాసవరపు అప్పలనాయుడు, మత్స్యకార నేత చింతకాయల ముత్యాలు, టిడిపి నేతలు బొండా సన్నిదేముడు, కోమటి వెంకట రమణ, ఇందల కొండలరావు, సింగపల్లి దివాకర్, రొంగలి గోపాలకృష్ట, వర్రి పరిదేశినాయుడు తదితరలు పాల్గొన్నారు.

సునామీ భయంతో పరుగులు తీసిన పూడిమడక మత్స్యకారులు


అచ్యుతాపురం, మార్చి 19: మండలంలో పూడిమడక సముద్రపునీరు గ్రామాల్లోకి చొరబడిరావడంతో గ్రామస్థులు సునామీ భయంతో పరుగులు తీసారు. ఇటీవల జపాన్‌లో వచ్చిన సునామీ తాకిడికి పలు దేశాలను కుదిపేసింది. అంతేగాక చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నట్లు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. పూడిమడక సముద్రం తీరందాటి గ్రామాల్లోకి నీరు రావడంతో మత్స్యకారులు హుళక్కుపడ్డారు. గతనెల మాఘపౌర్ణమిరోజు సముద్రం ఉగ్రరూపం దాల్చి ఎతె్తైన ప్రదేశంలో ఉన్న జాలారిపేట గ్రామంలో నీరుచొరబడి మత్స్యకారులను ఆందోళనకు గురిచేసింది. సముద్రతీరంలో నీరు రాకుండా అడ్డుకట్టవేసిన ఇసుకమూటలను సైతం తోసుకుని గ్రామాల్లోకి నీరు చొరబడింది. సముద్రం వెనకకు తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా ఈ మాఘపౌర్ణమి రోజున మరలా సముద్రం పొంగి గ్రామాల్లోకి చొరబడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. శనివారం తెల్లవారున సముద్రకెరటాల అలజడికి పోటెత్తి ఒక్కసారిగా నీరు జాలారిపేటకు చొరబడింది. ముందు సునామీ అనుకుని పరుగులు తీసిన మత్స్యకారులు సముద్రం వెనక్కుతగ్గడంతో మత్స్యకారులు ఊపిరిపీల్చుకున్నారు. గంగమ్మతల్లికి మత్స్యకారులు పూజలు చేస్తున్నారు.

Tuesday 8 March 2011

మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఐకాస పిలు పు మేరకు ఈ నెల 10వ తేదీన తలపెట్టిన హైదరాబాద్‌ దిగ్బంధం (మిలియన్‌ మార్చ్‌)ను కట్టడి చే సేందుకు పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. మిలియన్‌ మార్చ్‌పై వున్న సందిగ్దకు తె రదించుతూ ఈ కార్యక్రమం జరిగితీరుతుందని ఐకాస నేతలు సోమవారం స్పష్టం చేయగా, దీనికి అనుమతి లేన ందున అడ్డుకుని తీరతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌, సైబరా బాద్‌ కమిషనరేట్లలో ముందుగానే 144 సెక్షన్‌ను విధించారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు పదవ తేదీన హైదరాబాద్‌కు రాకుండా తెలంగాణ జిల్లాలలో అడుగడుగునా పోలీసులను మొహరించారు.  తెలంగాణ ఐకాస తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు పోలీసులు కసరత్తులు మొదలు పెట్టారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 10వ తేదీన ఉదయం నుంచి సాయ ంత్రం వరకు ఈ కార్యక్రమం జరగాల్సి వుంది. పదవ తేదీన తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌ కు పది లక్షల మందిని తరలించి అన్ని రోడ్లను దిగ్బంధం చేయాలన్నది ఐకాస నేతల వ్యూహం. రో డ్లపైనే వంటావార్పు చేయడంతో పాటు భోజనాలు కూడా చేసి సర్కారు కార్యక్రమాలను స్తంభింప చేస్తామని ఐకాస నేతలు ప్రకటించారు. మిలియన్‌ మార్చ్‌కు ముందుగా ఐకాస నిర్వహించిన 48 గం టల తెలంగాణ బంద్‌ విజయవంతమవడంతో హైదరాబాద్‌ దిగ్బంధం సైతం అంతే స్థాయిలో నిర్వ హించేందుకు నేతలు రంగం సిద్దం చేశారు. అయితే ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా మిలియన్‌ మార్చ్‌ను వా యిదా వేయాలని వివిధ వర్గాల నుంచి తెరాస తో పాటు ఐకాసపై ఒత్తిడి వచ్చింది. దీంతో కొంత మె త్తబడిన ఐకాస మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేయనప్పటికీ దీని వేళలను సడలించింది. ముందు గా అనుకున్న విధంగా కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వర కు నిర్వహించేందుకు నిర్ణయించింది. మిలియన్‌ మార్చ్‌ను హైదరాబాద్‌ అంతటా కాకుండా కేవలం ట్యాంక్‌బండ్‌ వరకే పరిమితం చేయాలని ఐకాస నిర్ణయించింది. ఈ కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందని, దీనికి పోలీసులు సహకరించాలని కూడా ఐకాస కోరింది. తెలంగాణ జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరింది. అయితే ఐకాస నేతల వినతిని పోలీసులు తోసిపుచ్చారు. మిలిమన్‌ మార్చ్‌కు అనుమతి లేదని, దీనిని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇంతకు ముందు రెండుసార్లు తెలంగాణ జిల్లాల ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎలా వ్యవహరించాలో డిజిపి అరవిందరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించగా సోమవారం నాడు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహించి మరీ మిలియన్‌ మార్చ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. జంట కమిషనరేట్లలో ఈ నెల 11వ తేదీ వరకు 144 సెక్ష న్‌ను విధించామని, మిలియన్‌ మార్చ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిని శివార్లలోనే నిలిపి వేస్తామని వారు పేరొన్నారు. పదవ తేదీన అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్‌కు రావద్దని వారు కోరారు.
రంగారెడ్డి, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు
తెలంగాణ అంతటా భారీ పహారా
ఇదిలావుండగా పదవ తేదీన జరగనున్న మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు నగర శివార్లలోని సైబరాబాద్‌తో పాటు దాని పక్కనే వున్న రంగారెడ్డి జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు రావాలంటే సైబరాబాద్‌ మీదుగానే రావాల్సి వుండడంతో పోలీసులు ఈ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌కు చేరుకోవడానికి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, మహ బూబ్‌నగర్‌ జిల్లాల నుంచి మార్గాలు వుండడంతో అక్కడా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ రెండు ప్రా ంతాలలో చెక్‌ పోస్టుల వద్ద పెద్ద సంఖ్యలో సాయుధులను నియమించనున్నారు. మంగళవారం నుం చి చెక్‌ పోస్టుల వద్ద పోలీ సుల మొహరింపు ప్రారంభమయ్యే వీలుంది. చెక్‌ పోస్టుల వద్ద వీలునుబట్టి స్థానిక పోలీసులతో పాటు సాయుధులు కూడా వుండేలా ఉన్నతాధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాలతో పాటు రైలు మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. తొమ్మిదవ తేదీ నుంచి హై దరాబాద్‌కు వచ్చే వారిపై నిఘా వుంచాలని నిర్ణయించారు. పదవ తేదీన హైదరాబాద్‌కు వచ్చే అన్ని రైళ్లను సైబరాబాద్‌ పరిధిలోనే నిలిపివేసి సోదాలు నిర్వహించి మిలియన్‌ మార్చ్‌కు వచ్చే వారిని అదు పులోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైదరాబాద్‌కు రాకుండా పోలీసులు ఇన్ని ఏర్పాట్లు చేయగా తెలంగాణ జిల్లాలలోనూ పరిస్థితి ఇదే విధంగా వుంది. తెలంగాణ జిల్లాలలోని అన్ని మండలాలలో ఇప్పటికే పోలీసు పహారా ఏర్పాటు చేయ డంతో పాటు పదవ తేదీన హైదరాబాద్‌కు ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకోసాగారు. తొమ్మిది, పద వ తేదీలలో భద్రతను మరింత పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.