వేంపల్లె, మే 13: ఉప ఎన్నికల్లో పోటీచేసిన తనను, తన తల్లి విజయమ్మను నాన్న, కడప ప్రజలు ఆశీర్వదించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ విజేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కడప ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి తమను ఆశీర్వదించారని అన్నారు. కడప ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియగానే వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న జగన్మోహన్‌రెడ్డి తన తండ్రికి నివాళులర్పించారు. జగన్‌ను కలిసేందుకు ఇడుపులపాయకు వేలాది మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. నీ వెంటే మేమంటూ ప్రజలు నినాదాలు చేశారు. భవిష్యత్తు మనదేనంటూ కేరింతలు కొట్టారు. వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు జగన్ చేరుకొన్నారు. ఆయన వెంట రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తదితర శాసన సభ్యులు, నాయకులు ఉన్నారు. (చిత్రం) ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న జగన్ మోహన్‌రెడ్డి
No comments:
Post a Comment