Tuesday 8 March 2011

మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


మిలియన్‌ మార్చ్‌కి పోలీస్‌ భారీ సన్నాహాలు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఐకాస పిలు పు మేరకు ఈ నెల 10వ తేదీన తలపెట్టిన హైదరాబాద్‌ దిగ్బంధం (మిలియన్‌ మార్చ్‌)ను కట్టడి చే సేందుకు పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. మిలియన్‌ మార్చ్‌పై వున్న సందిగ్దకు తె రదించుతూ ఈ కార్యక్రమం జరిగితీరుతుందని ఐకాస నేతలు సోమవారం స్పష్టం చేయగా, దీనికి అనుమతి లేన ందున అడ్డుకుని తీరతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌, సైబరా బాద్‌ కమిషనరేట్లలో ముందుగానే 144 సెక్షన్‌ను విధించారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు పదవ తేదీన హైదరాబాద్‌కు రాకుండా తెలంగాణ జిల్లాలలో అడుగడుగునా పోలీసులను మొహరించారు.  తెలంగాణ ఐకాస తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు పోలీసులు కసరత్తులు మొదలు పెట్టారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 10వ తేదీన ఉదయం నుంచి సాయ ంత్రం వరకు ఈ కార్యక్రమం జరగాల్సి వుంది. పదవ తేదీన తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌ కు పది లక్షల మందిని తరలించి అన్ని రోడ్లను దిగ్బంధం చేయాలన్నది ఐకాస నేతల వ్యూహం. రో డ్లపైనే వంటావార్పు చేయడంతో పాటు భోజనాలు కూడా చేసి సర్కారు కార్యక్రమాలను స్తంభింప చేస్తామని ఐకాస నేతలు ప్రకటించారు. మిలియన్‌ మార్చ్‌కు ముందుగా ఐకాస నిర్వహించిన 48 గం టల తెలంగాణ బంద్‌ విజయవంతమవడంతో హైదరాబాద్‌ దిగ్బంధం సైతం అంతే స్థాయిలో నిర్వ హించేందుకు నేతలు రంగం సిద్దం చేశారు. అయితే ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా మిలియన్‌ మార్చ్‌ను వా యిదా వేయాలని వివిధ వర్గాల నుంచి తెరాస తో పాటు ఐకాసపై ఒత్తిడి వచ్చింది. దీంతో కొంత మె త్తబడిన ఐకాస మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేయనప్పటికీ దీని వేళలను సడలించింది. ముందు గా అనుకున్న విధంగా కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వర కు నిర్వహించేందుకు నిర్ణయించింది. మిలియన్‌ మార్చ్‌ను హైదరాబాద్‌ అంతటా కాకుండా కేవలం ట్యాంక్‌బండ్‌ వరకే పరిమితం చేయాలని ఐకాస నిర్ణయించింది. ఈ కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందని, దీనికి పోలీసులు సహకరించాలని కూడా ఐకాస కోరింది. తెలంగాణ జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరింది. అయితే ఐకాస నేతల వినతిని పోలీసులు తోసిపుచ్చారు. మిలిమన్‌ మార్చ్‌కు అనుమతి లేదని, దీనిని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇంతకు ముందు రెండుసార్లు తెలంగాణ జిల్లాల ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎలా వ్యవహరించాలో డిజిపి అరవిందరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించగా సోమవారం నాడు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహించి మరీ మిలియన్‌ మార్చ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. జంట కమిషనరేట్లలో ఈ నెల 11వ తేదీ వరకు 144 సెక్ష న్‌ను విధించామని, మిలియన్‌ మార్చ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిని శివార్లలోనే నిలిపి వేస్తామని వారు పేరొన్నారు. పదవ తేదీన అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్‌కు రావద్దని వారు కోరారు.
రంగారెడ్డి, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు
తెలంగాణ అంతటా భారీ పహారా
ఇదిలావుండగా పదవ తేదీన జరగనున్న మిలియన్‌ మార్చ్‌ను నిలువరించేందుకు నగర శివార్లలోని సైబరాబాద్‌తో పాటు దాని పక్కనే వున్న రంగారెడ్డి జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు రావాలంటే సైబరాబాద్‌ మీదుగానే రావాల్సి వుండడంతో పోలీసులు ఈ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌కు చేరుకోవడానికి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, మహ బూబ్‌నగర్‌ జిల్లాల నుంచి మార్గాలు వుండడంతో అక్కడా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ రెండు ప్రా ంతాలలో చెక్‌ పోస్టుల వద్ద పెద్ద సంఖ్యలో సాయుధులను నియమించనున్నారు. మంగళవారం నుం చి చెక్‌ పోస్టుల వద్ద పోలీ సుల మొహరింపు ప్రారంభమయ్యే వీలుంది. చెక్‌ పోస్టుల వద్ద వీలునుబట్టి స్థానిక పోలీసులతో పాటు సాయుధులు కూడా వుండేలా ఉన్నతాధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాలతో పాటు రైలు మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. తొమ్మిదవ తేదీ నుంచి హై దరాబాద్‌కు వచ్చే వారిపై నిఘా వుంచాలని నిర్ణయించారు. పదవ తేదీన హైదరాబాద్‌కు వచ్చే అన్ని రైళ్లను సైబరాబాద్‌ పరిధిలోనే నిలిపివేసి సోదాలు నిర్వహించి మిలియన్‌ మార్చ్‌కు వచ్చే వారిని అదు పులోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైదరాబాద్‌కు రాకుండా పోలీసులు ఇన్ని ఏర్పాట్లు చేయగా తెలంగాణ జిల్లాలలోనూ పరిస్థితి ఇదే విధంగా వుంది. తెలంగాణ జిల్లాలలోని అన్ని మండలాలలో ఇప్పటికే పోలీసు పహారా ఏర్పాటు చేయ డంతో పాటు పదవ తేదీన హైదరాబాద్‌కు ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకోసాగారు. తొమ్మిది, పద వ తేదీలలో భద్రతను మరింత పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


No comments:

Post a Comment