Tuesday 8 March 2011

నీ వాటా ఎంత ?


నీ వాటా ఎంత ?


కాకరాపల్లి థర్మల్‌ ప్రాజెక్టు బాధితులను ఓదార్చేందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆ బాధి తులనుంచే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈస్ట్‌కోస్ట్‌ పవర్‌ ప్లాంట్‌లో నీ వాటా ఎంత? అంటూ బాధితులు నిలదీశారు. దీంతో జగన్‌ అవాక్కయ్యారు. ఊహించని ఈ సంఘటన నుంచి తేరుకుని, వారిని ఓదార్చేందుకు జగన్‌ నానా తంటాలు పడ్డారు. వాళ్లని నమ్మించడం ఆయనకు ఓపట్టాన సాధ్యం కాలేదు. ఈ పవర్‌ ప్లాంట్‌తో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ప్రత్యక్షంగానైనా, పరోక్షంగా నైనా ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.  అయినప్పటికీ ఈ కంపెనీలో ప్రధాన వాటాదారు లెంతమంది? వాళ్లెవ రెవరంటూ జనం నినాదాల రూపంలో ప్రశ్నల వర్షం కురి పించారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ ‘‘నాకుగానీ, నా కుటుంబానికిగానీ ఈ ప్లాం టుతో ఎటువంటి సంబంధం ఉన్నా నా కుటుం బం మట్టికొట్టుకు పోతుంది. సరేనా?’’ అంటూ ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శకు జగన్‌ ఇక్కడికి వచ్చారు. స్థానికుల ఆగ్రహావేశాలను స్వంగా అంచనా వేసి, అనుభవానికొచ్చిన జగన్‌ ఆ ఉద్రిక్తతను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు.  అబద్దాలు చెప్పడం తనకు చేతకాదని అన్నారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్లాంట్‌ మంజూరైందన్న విషయాన్ని అంగీకరించారు. అయితే స్థానికుల వ్యతి రేకతను వైఎస్‌ఆర్‌ దృష్టికి తేకుండా తప్పుదోవ పట్టించారని పరో క్షంగా మంత్రి ధర్మాన ప్ర సాదరావు తదిత రులపైనా విమర్శనాస్త్రలు సంధించారు.ఈ ప్లాంట్‌ పై ఇప్పుడు జరుగుతున్న గొడవలో 10 శాతం ప్రజలు కాదన్నా ఆ రోజేప్లాంట్‌ రద్దచేసేవారన్నారు. ఈప్లాంట్‌ వద్దని ఇంతమంది ప్రజలు చెప్పడం తప్పా అంటూ జగన్‌ ప్రశ్నించారు. వద్దన్న ఉద్యమకారుల శ వాలపై ప్లాంట్‌ నిర్మిస్తే వారి ఉసురు యాజమాన్యానికి తప్పక తగులుతుందన్నారు. ఇందులో తన కుటుంబానికి వాటాలున్నాయని కొంత మంది నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప ఇందులో తన ప్రమేయమేమీలేదని జగన్‌ స్పష్టం చేశారు.  ‘‘నాకు ఈ ప్రాజెక్టులో వాటా ఉంటే ఇప్పుడు నేనే వద్దని చెబుతున్నాను కాబట్టి ప్రభుత్వం వెంటనే రద్దు చేయమనండి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడు చు కోవాలన్నారు. ఇక్కడ థర్మల్‌ ఉద్యమకారులపై జరిగిన ఘటన ఎమర్జన్సీని తలపిస్తోంద న్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు థర్మల్‌ బాధితులను పరామర్శించడానికి వచ్చారు కాని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకలు కింజరాపు సోదరులు ఎందు రాలేదని నిలదీశారు. బాధితులను పరామర్శించి వెళ్లిన చంద్రబాబు అసెంబ్లీలో కాకరాపల్లి ఘటన పై చర్చ జరుగుతున్నప్పుడు ఎందు కు కనిపించలేదని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌, టీడీపీ నాయకలు కుమ్మకై ఈ ప్రాజెక్టు కడుతు న్నారనడానిక ఇంతకంటే నిదర్శన మేమికావాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇప్పటి నుంచి ప్లాంట్‌ ఆ గే వరకు మీ పోరాటంలో పాలు పంచుకుంటానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. తనకు ఇందులో వాటా ఉన్న విషయమై… ప్రభుత్వం జరిపే ఏ దర్యాప్తుకైనా సిద్ధమంటూ ఛాలెంజ్‌ చేశారు. ముందుగా ఆకాశలక్కవరం చేరు కున్న జగన్‌కు అక్కడి విద్యార్థులు థర్మల్‌ ప్లాంట్‌ రద్దు చేయాలని, ఎంపి కృపారాణి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, కింజరాపు సోదరులు డౌన్‌డౌన్‌ అంటూ ప్లకార్డు పట్టుకొని పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. అనంతరం జీరు నాగేశ్వరావు కుటుంబాన్ని జగన్‌ పరా మర్శిం చి ఓదార్చారు.కొంత ఆర్థిక సహాయం చేశారు. జగన్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే కొర్ల భారతి, కొండాసురేఖ, గొల్ల బాబురావు,ప్రసాద్‌రాజు, భూమా కరుణాకర్‌ రెడ్డి,కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపి కణితి విశ్వనాధం తదితరులు వున్నారు.


No comments:

Post a Comment