Sunday 20 March 2011

సునామీ భయంతో పరుగులు తీసిన పూడిమడక మత్స్యకారులు


అచ్యుతాపురం, మార్చి 19: మండలంలో పూడిమడక సముద్రపునీరు గ్రామాల్లోకి చొరబడిరావడంతో గ్రామస్థులు సునామీ భయంతో పరుగులు తీసారు. ఇటీవల జపాన్‌లో వచ్చిన సునామీ తాకిడికి పలు దేశాలను కుదిపేసింది. అంతేగాక చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నట్లు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. పూడిమడక సముద్రం తీరందాటి గ్రామాల్లోకి నీరు రావడంతో మత్స్యకారులు హుళక్కుపడ్డారు. గతనెల మాఘపౌర్ణమిరోజు సముద్రం ఉగ్రరూపం దాల్చి ఎతె్తైన ప్రదేశంలో ఉన్న జాలారిపేట గ్రామంలో నీరుచొరబడి మత్స్యకారులను ఆందోళనకు గురిచేసింది. సముద్రతీరంలో నీరు రాకుండా అడ్డుకట్టవేసిన ఇసుకమూటలను సైతం తోసుకుని గ్రామాల్లోకి నీరు చొరబడింది. సముద్రం వెనకకు తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా ఈ మాఘపౌర్ణమి రోజున మరలా సముద్రం పొంగి గ్రామాల్లోకి చొరబడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. శనివారం తెల్లవారున సముద్రకెరటాల అలజడికి పోటెత్తి ఒక్కసారిగా నీరు జాలారిపేటకు చొరబడింది. ముందు సునామీ అనుకుని పరుగులు తీసిన మత్స్యకారులు సముద్రం వెనక్కుతగ్గడంతో మత్స్యకారులు ఊపిరిపీల్చుకున్నారు. గంగమ్మతల్లికి మత్స్యకారులు పూజలు చేస్తున్నారు.

No comments:

Post a Comment